Wednesday, August 15, 2018

ఎస్‌బీఐ ‘ఏటీఎం కార్డులు’ ఇక పనిచేయవు

*💥ఎస్‌బీఐ 'ఏటీఎం కార్డులు' ఇక పనిచేయవు!*

♦డిసెంబరు 31లోగా చిప్‌ కార్డుకు మారాలి: ఎస్‌బీఐ


♦న్యూఢిల్లీ, ఆగస్టు 14: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీ ఏటీఎం కార్డు.. చిప్‌ కార్డు అవునో కాదో చూసుకోండి. ఎందుకంటే డిసెంబరు 31 తర్వాత చిప్‌ లేని, మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు పనిచేయవట. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఎస్‌బీఐ ఒక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం లావాదేవీలను మరింత సురిక్షతం చేసేందుకు మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటి స్థానంలో కొత్త ఈఎంవీ చిప్‌ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. 

♦ఈఎంవీ చిప్‌ కార్డుల కోసం డిసెంబరు 31లోగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత బ్రాంచిలో సంప్రదించాలని సూచించింది.