Wednesday, August 15, 2018

జనవరి 6 నుంచి జేఈఈ మెయిన్‌

*💥జనవరి 6 నుంచి జేఈఈ మెయిన్‌*

♦సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు

♦అదే నెల 30 వరకు గడువు
ఏప్రిల్‌లో మరోసారి పరీక్ష

♦ఏడాదిలో రెండు సార్లు నిర్వహణ

♦ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే పరీక్ష

♦న్యూఢిల్లీ: జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(జేఈఈ) మెయిన్స్‌ను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించనున్నారు. ఏటా జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే పరీక్షకు సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు అందించనున్నారు. అదే నెల 30 కల్లా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జేఈఈ మెయిన్స్‌ను సీబీఎస్‌ఈ నిర్వహించగా ఇక నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేపట్టనుంది.
 
♦పరీక్షను 2019 జనవరి 6 నుంచి 20వ తేదీ వరకు 8 దఫాలుగా నిర్వహిస్తారు. విద్యార్థుల వీలును బట్టి పరీక్ష రాయడానికి ఆయా తేదీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మళ్లీ ఏప్రిల్‌లోనూ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. రెండు సార్లు పరీక్ష రాసిన అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చిన దానినే పరిగణనలోకి తీసుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకుంది.
 
♦జనవరిలో రాసే పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధానాల్లోనూ పరీక్షలు జరిగేవి, అయితే ఈ సారి మాత్రం కేవలం ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. కాగా, ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించడం, ఎన్‌టీఏ కొత్తగా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వంటి మార్పులు చోటు చేసుకుంటుండడంతో విద్యార్థుల్లో పరీక్షపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిని తీర్చేందుకు ఈ నెలలో దేశవ్యాప్తంగా ఎన్‌టీఏ మాక్‌ టెస్ట్‌ను నిర్వహించనుంది.