స్వచ్ఛ సర్వేక్షన్‌లో రాష్ట్రానికి మూడు అవార్డులు ప్రధానం
♦హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ (గ్రామీణం) పథకం అమలుగాను 2018 సంవత్సరానికి అత్యుత్తమ ప్రగతి సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. స్వచ్చ భారత్ లో ఒక జాతీయ స్థాయి అవార్డు, స్వచ్చ సర్వేక్షన్‌లో మరో రెండు జాతీయ స్థాయి అవార్డులను పెద్దపల్లి జిల్లా, వరంగల్ అర్బన్ జిల్లాకు దక్కాయి. ఈ అవార్డులను గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రవాస భారతీయ కేంద్రంలో అందజేశారు. కేంద్ర మంత్రి ఉమాభారతి చేతులమీదుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన దేవసేన, ఆమ్రపాలి అవార్డులు అందుకున్నారు.
♦మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల పనితీరు ఆధారంగా రాష్ట్రాలను, జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో విద్యాపరంగానేగాక సమాచారాన్ని చేరవేయడం ద్వారా చైతన్యాన్ని పెంచారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) ప్రమాణాల ప్రకారం రాష్ట్రస్థాయిలో ఆయా జిల్లాల మధ్య, జాతీయస్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల మధ్య పనితీరును పరిశీలన చేశారు.
♦స్వచ్ఛభారత్ మిషన్ అమలుచేస్తున్న అన్ని జిల్లాల, గ్రామాలలోని బడులు, అంగన్వాడీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంత బజార్లు, మతపరమైన ప్రదేశాల వంటి బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్యపురోగతి పొందడం వంటి లక్ష్యాలతో చేపట్టిన కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయి ఆవార్డులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అలాగే ఈ పథకంలో కల్పించిన అన్ని ఆస్తులకు భువన్ సాఫ్ట్‌వేర్ ద్వారా జియో ట్యాగింగ్ చేయడంతో ఎక్కువగా ఆస్తులను కంప్యూటరీకరణ చేసినట్టు చెప్పారు.