Saturday, July 28, 2018

బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్

*💥బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్*  

♦హైదరాబాద్: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ రిక్రూట్‌మెంట్ పరీక్షకు ఉచిత శిక్షణనివ్వనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. 

♦గ్రామీణ ప్రాంత అభ్యర్థుల వార్షికాదాయం 1.5 లక్షలు, 
పట్టణ ప్రాంతం వారికి రూ. 2 లక్షల మించరాదన్నారు. ఆశావాహులైన బీసీ, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov. in లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

♦దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30 వ తేదీతో ప్రారంభమవుతుందని, ఆగస్ట్ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.